విశ్వనాథనాయకుని తర్వాత అతని కుమారుడు కృష్ణప్పనాయకుడు పాలించాడు. క్రీ.శ 1602-1609 వరకు ముద్దు కృష్ణప్ప, 1609 నుంచి 23 వరకు ముద్దు వీరప్ప పరిపాలించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముద్దు వీరప్ప కుమారుడు తిరుమల నాయకుడు మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తిరుమలరాయ మహల్‌ని నిర్మించి, తెలుగు భాషని, సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. తిరుమల నాయకుడి కుమారుడు చొక్కనాథుని కాలంలో నాయక రాజ్య పతనం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత వచ్చిన విజయరంగ చొక్కనాయకుడు చిన్నపిల్లవాడు కావడంతో అతని అమ్మమ్మ రాణి మంగమ్మాళ్ రాజ్యపాలన చేసింది. విజయరంగ చొక్కనాథుడు యుక్తవయసుకు వచ్చిన తర్వాత పాలన బాధ్యతలను చేపట్టాడు. అతడి తర్వాత అతని భార్య రాణి మీనాక్షి రాజ్యాధికారాన్ని చేపట్టింది. స్ర్తీల అధికారాన్ని భరించలేని ఆ రాజ్యంలోని కొందరు ఆమెపై కుట్ర పన్నారు. దాంతో ఆర్కాట్ పాలకుడు చాంద్ సాహెబ్ మధురపై దండెత్తి, ఆర్కాట్ రాజ్యంలో కలుపుకున్నాడు. లొంగిపోవటం ఇష్టం లేని మీనాక్షి ఆత్మత్యాగం చేసుకుంది.
Monday, September 10, 2012
విజయనగర......మధరనాయక రాజ్యం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment